భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. అశ్వారావుపేటలో ఆధునిక టర్బైన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. కాలుష్య రహిత 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ. 73 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. రూ. 18 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశామన్నారు. రూ. 2 లక్షల పైబడి ఉన్న రైతు రుణమాఫీ చేసేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు.