Homeహైదరాబాద్latest Newsఫామ్ హౌస్ దొంగలకు సద్ది మోస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి

ఫామ్ హౌస్ దొంగలకు సద్ది మోస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి

ఇదే నిజం, అమ్రాబాద్: అచ్చంపేట పట్టణం లో సాయి నగర్ కాలనీ లో జరిగిన సంఘటన ను రాజకీయం చేస్తూ లేని పోని ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అసత్య ఆరోపణలు మానుకోవాలి అని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుంద మల్లికార్జున్ అన్నారు.. శుక్రవారం నాడు యూత్ కాంగ్రెస్ నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.. గత పది సంవత్సరాలుగా అచ్చంపేట బీఆర్ఎస్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజ్ నిరంకుశ పాలన లో అనేక అక్రమాలు, బెదిరింపులు, దాడులు, కిడ్నాప్ ల తో ప్రజలు భయబ్రాంతులతో ఉండే వారు ఇపుడే కాంగ్రస్ పార్టి అధికారం లోకి రాగానే వంశీకృష్ణ ఎంఎల్ఏ గా గెలిచిన వెంటనే స్వేచ్ఛా వాతావరణం నెలకొంది.

ఫాం హౌస్ దొంగలకు సద్ది మోస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో జరిగిన సంఘటన ల లో ఎందుకు జోక్యం చేసుకోలేదు. అపుడు కేసిఆర్ దొర పాలన వద్దు ఆంటీవి , ఇపుడు కేసిఆర్ పాలన ముద్దు అంటున్నావ్,, స్థిరత్వం లేదు, రాజకీయ అవగాహన లేదు మీకు మీరు సపోర్ట్ చేస్తున్న గువ్వల బాల్ రాజ్ పెద్ద రౌడీ అలాంటి వ్యక్తి నీ పక్కన పెట్టుకొని అచ్చంపేట లో రౌడీ రాజకీయం అనడం ఎంత వరకు సమంజసం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజ్ అవినీతి, అక్రమాలు, పై బహిరంగ చర్చకు సిద్ధం మీరు సిద్ధం అయితే రండి అచ్చంపేట లొ గువ్వల బాల్ రాజ్. రౌడి రాజ్యం పోయి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. గువ్వలా బాల్ రాజ్ నిరంకుశ పాలన పోయింది,, వంశీ కృష్ణ ప్రజా పాలన వచ్చింది. ఇపుడు అచ్చంపేట ఫ్రీడమ్ గా ఉంది. నిరంతరం ప్రజా సేవ చేస్తూ ప్రజలకు అన్ని రకలుగా అందుబాటులో ఉంటూ న్న ఎమ్మెల్యే వంశీ కృష్ణ పై లేని పోని ఆరోపణలు చెస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని అన్నారు… ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నేతలు దాశరథీ పవన్, కృష్ణ నాయక్, శివ,చెన్నాకేసువులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img