Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్​లో చేరనున్న ఆర్ఎస్పీ సోదరుడు!

కాంగ్రెస్​లో చేరనున్న ఆర్ఎస్పీ సోదరుడు!

– నేడో, రేపో సీఎం రేవంత్​తో భేటీ అయ్యే అవకాశం

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ సోదరుడు ఆర్‌ఎస్‌ ప్రసన్న కుమార్‌ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెండు మూడ్రోజుల్లో సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
సోదరుడు ప్రసన్నకుమార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్‌ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన సంగతి తెలిసిందే. అయితే, బీఎస్పీ అధ్యక్ష పదవి వదిలేసి బీఆర్‌ఎస్‌లో ప్రవీణ్‌కుమార్‌ చేరిన కొద్ది రోజులకే నియోజకవర్గాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాను రాజకీయ ప్రత్యర్థిగా భావించే చల్లా వెంకట్రామిరెడ్డితో ఆర్‌ఎస్పీ భేటీ కావడం ప్రసన్నకుమార్​ను విస్మయానికి గురిచేసింది. ఈ క్రమంలోనే సొంత అన్నతో రాజకీయంగా విబేధించాలని సిద్ధపడినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.ఇప్పటికే హస్తం నేతలతో సంప్రదింపులు జరిపిన ప్రసన్న కుమార్‌.. నేడో,రేపో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Recent

- Advertisment -spot_img