హైదరాబాద్ లో ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో సేవలు అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా పార్శిళ్ల హోం డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ద్వారా ఆదివారం నుంచి పార్శిళ్ల హోం డెలివరీ ప్రారంభం అవుతుందన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా హోం డెలివరీ సేవలు విస్తరిస్తామని చెప్పారు. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ప్రజలంతా సేవలను వినియోగించుకోవాలని కోరారు.