బస్టాప్‌లు, సమయం, బస్సుల వివరాలు తెలిపే గమ్యం యాప్ పనిచేయడం లేదని తరచూ ఫిర్యాదు చేస్తున్నా RTCఅధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట మెట్రోఎక్స్‌ప్రెస్ బస్సులను యాప్ పరిధిలోకి తీసుకువచ్చారు. త్వరలో ఆర్డినరీ బస్సులను యాప్‌లో చూసుకునే సౌకర్యం కల్పిస్తామని అధికారులు చెప్పినా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు యాప్ సేవలను మెరుగుపర్చాలని పలువురు కోరుతున్నారు.