RTC strike : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సైరన్ మోగించారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నిర్ణయం తీసుకుంది. సమ్మె నోటీసును టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు జేఏసీ నేతలు అందజేశారు. మే 7న మొదటి డ్యూటీ నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు వారు నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. నేటి వరకు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని నోటీసుల్లో పేర్కొన్నారు.