ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా మద్నూర్ న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని మద్నూర్ ఎస్సై విజయ్ కొండ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడకూడదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. వేడుకలను కుటుంబ సమేతంగా, ఇళ్లల్లో సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిబుల్, రాష్, రాంగ్ రూట్ డ్రైవింగ్, దాడులు, బెదిరింపులకు పాల్పడడం, రోడ్లపై వెళ్లే వారిని ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31 నైట్ కచ్చితంగా వాహన తనిఖీలు భాగంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించబడును మద్యం సేవించి వాహన నడుపుతున్న వారికి డ్రంకెన్ టెస్ట్ నిర్వహించి వారి పైన కేసు నమోదు చేస్తామని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను బయటకు పంపించి ఇబ్బందులు పడవద్దని ఎస్సై విజయ్ కొండ సూచించారు.