Homeబిజినెస్‌Rupee Value : ప‌దేండ్ల రికార్డు స్థాయి ప‌త‌నానికి రూపాయి

Rupee Value : ప‌దేండ్ల రికార్డు స్థాయి ప‌త‌నానికి రూపాయి

Rupee Value : ప‌దేండ్ల రికార్డు స్థాయి ప‌త‌నానికి రూపాయి

Rupee Value : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల తగ్గుదల నేపథ్యంలో ఈ ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.

అయితే, అమెరికాలో ద్రవ్యోల్బణం 41 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం రానుందనే అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది.

దీంతో, వారు అమ్మకాలకు మొగ్గు చూపారు. రూపాయి విలువ డాల‌ర్‌కు 85 కు దిగ‌జారింది.

ఇది గ‌త ప‌దేండ్ల రికార్డు స్థాయి ప‌త‌నం.

ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్లు కోల్పోయి 53,416కి పడిపోయింది.

నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 15,938 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్ స్టాకులు ఎక్కువగా నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:

సన్ ఫార్మా (2.28%), డాక్టర్ రెడ్డీస్ (1.73%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.50%), మారుతి (1.45%), టైటాన్ (0.85%).

టాప్ లూజర్స్:

యాక్సిస్ బ్యాంక్ (-1.74%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.53%), ఎస్బీఐ (-1.48%), టెక్ మహీంద్రా (-1.44%), టీసీఎస్ (-1.31%).

Recent

- Advertisment -spot_img