Homeఅంతర్జాతీయంగుడ్ న్యూస్‌.. మార్కెట్‌లోకి రష్యా కరోనా వ్యాక్సిన్‌

గుడ్ న్యూస్‌.. మార్కెట్‌లోకి రష్యా కరోనా వ్యాక్సిన్‌

మాస్కో: ర‌ష్యా డెవ‌ల‌ప్ చేసిన క‌రోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్‌-వి’ ‌ను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. త్వరలోనే దీనిని దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తామని పేర్కొంది. ‘‘కరోనా వైరస్‌ను నియంత్రించడానికి గమాలియా నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ అన్ని రకాల ప్రయోగ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించింది. అందువల్ల దీనిని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం’’ అని రష్యా ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తమ వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలు క్యూ కడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు బిలియన్‌ డోస్‌ల వ్యాక్సిన్‌ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్‌ చేశాయని ఈ వ్యాక్సిన్‌కు నిధులు సమకూరుస్తున్న రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంస్థ వెల్లడించింది.
ఇప్పటికే రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ను మాత్రమే విజయవంతంగా పూర్తి చేసుకున్న రష్యా టీకా.. మూడో దశ ప్రయోగాలను భారత్‌లో చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు రష్యా అధికారులు భారత్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సౌదీ అరేబియా, బ్రెజిల్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌ లాంటి దేశాలు స్పుత్నిక్‌ మూడో దశ ప్రయోగాలను అనుమతిచ్చాయి. భారత్‌ కూడా అనుమతిస్తే.. టీకా ప్రపంచ వ్యాప్తంగా వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img