Homeఅంతర్జాతీయంభారత్‌కు రష్యానే శాశ్వత మిత్రువు అని నిరూపించుకుంది

భారత్‌కు రష్యానే శాశ్వత మిత్రువు అని నిరూపించుకుంది

రష్యాకు భారత్​కు ఎన్నో దశాబ్దాలుగా విడదీయరాని భందం ఉంది.

రష్యాకు భారత్​ పట్ల ఉన్న అభిమానాన్ని మరోసారి నిరూపించుకుంది.

దీంతో ఎప్పటికీ భారత్​కు తాము ఉన్నామనే భరోసాను పునరావృతం చేసింది రష్యా.

భారత్‌లో రెండోసారి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆపన్నహస్తం అందించేందుకు రష్యా ముందుకొచ్చింది.

ప్రతిరోజూ లక్షలాది కేసులు వెలుగు చూస్తుండడంతో దేశంలో పరిస్థితి భయానకంగా ఉంది.

ఆక్సిజన్ అందక రోగులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.

మరోవైపు, అత్యవసర చికిత్సలో ఉపయోగించే యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ కొరత కూడా వేధిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. మరో 15 రోజుల్లో వీటిని పంపిస్తామని పేర్కొంది.

భారత్‌కు ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధికారి ఒకరు తెలిపారు.

వారానికి మూడు నుంచి నాలుగు లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను పంపిస్తామని, నౌకల ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తామని పేర్కొన్నట్టు తెలుస్తోంది.

రష్యా ప్రతిపాదనపై భారత్ ఇప్పటి వరకు స్పందించలేదు.

కాగా, దేశంలో రెమ్‌డెసివిర్ ఔషధానికి కొరత ఏర్పడడంతో భారత ప్రభుత్వం ఇటీవల వాటి ఎగుమతిని నిషేధించింది.

ఆ ఔషధంపై దిగుమతి సుంకాలను కూడా రద్దు చేసింది.

Recent

- Advertisment -spot_img