Russia Ukraine Effect | పెరగనున్న స్మార్ట్‌ఫోన్లు, కార్ల ధరలు
Russia Ukraine Effect : ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రభావం కేవలం ముడి చమురు, సహజవాయువుకే పరిమితం కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు.
ఇతర నిత్యావసరాలపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించారు.
వాటిల్లో ఒకటి పల్లాడియం.. స్మార్ట్ ఫోన్లు మొదలు హైబ్రీడ్ కార్లు, ఎలక్ట్రిక్ పరికరాలు, దంతాల చికిత్సతోపాటు ఆభరణాల తయారీలో దీన్ని వాడతారు.
రష్యాలోనే పల్లాడియం అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది.
కనుక భారత్‌తోపాటు ప్రపంచ దేశాలన్నీ పల్లాడియం కోసం రష్యాపై ఆధారపడాల్సిందే.
ఇలా పల్లాడియం లభ్యం
పల్లాడియం మెరిసిపోయే తెల్లని లోహం. ప్లాటినం, రూథేనియం, రోడియం, ఓస్మియం, ఇరిడియంలతో కూడినదే ఈ పల్లాడియం.
రష్యాతోపాటు దక్షిణాఫ్రికాల్లో మాత్రమే భారీ మొత్తంలో ఇది లభిస్తుంది.
ప్లాటినం, ఇరిడియం నుంచి దీన్ని వెలికితీస్తారు.
ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత విలువైన అరుదైన లోహాల్లో ఒకటి. అందుకే దీని కొరత ఎక్కువ.
Health Tips: తినాలనే కోరికను ఎలా నియంత్రించుకోవాలి?
భూతాప నివారణలో పల్లాడియం పాత్ర
భూతాప నివారణకు వాహనాల నుంచి కర్బన ఉద్గారాల నియంత్రణకు ప్రపంచ దేశాలన్నీ కఠిన చర్యలు చేపట్టాయి.
విద్యుత్ వాహనాల దిశగా యావత్ ప్రపంచం అడుగులేస్తున్నది.
తత్ఫలితంగా ఆయా కార్లలో పల్లాడియం వాడకానికి డిమాండ్ పెరిగింది.
కానీ డిమాండ్‌కు తగినంత పల్లాడియం సరఫరా కావట్లేదన్న అభిప్రాయం వినిపిస్తున్నది.
అందువల్లే బంగారం, ప్లాటినం కంటే పల్లాడియం ధర చాలా ఎక్కువ.
ఇలా పల్లాడియం ధర
ఒక గ్రామ్ పల్లాడియం ధర రూ.6,188. అంటే ఇది ఎంత అరుదైనదో.. విలువైనదో అర్థం అవుతుంది కదా.
పది గ్రాముల పల్లాడియం ధర రూ.72,184. కిలో కావాలంటే రూ.61,88,797 చెల్లించాల్సిందే.
మరోవైపు పది గ్రాముల బంగారం ధర రూ.51,419. పదిగ్రాముల ప్లాటినం ధర రూ.35,810.
ఎర్ర ఉల్లి, తెల్ల ఉల్లి.. ఆరోగ్యానికి ఏది మేలు..
మాస్కులు వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కార్లలో పల్లాడియం ఇలా
పెట్రోల్, హైబ్రీడ్ వాహనాల్లో వాడే ఎగ్జాస్ట్స్‌ల్లోని క్యాటలిక్ కన్వర్టర్ల తయారీకి పల్లాడియం వాడతారు.
2009లో తొలిసారి డీజిల్ కంటే పెట్రోల్ వినియోగ కార్ల విక్రయాలు పెరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో కార్బన్ మొనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి విషపూరిత వాయువులను తక్కువ హాని కలిగించే నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్‌గా కన్వర్ట్ చేయడానికి ఎగ్జాస్ట్స్‌ల్లో 80 శాతం పల్లాడియం వాడుతున్నారు.
కార్ల ధరలు పైపైకి
ఐసీబీసీ స్టాండర్డ్ బ్యాంక్ డేటా ప్రకారం క్యాటలిక్ కన్వర్టర్ల తయారీకి ఉపయోగించే పల్లాడియంలో 75-80 శాతం భూగర్భ గనుల నుంచి వెలికి తీస్తారు.
ప్రతి క్యాటలిక్ కన్వర్టర్లలో రెండు నుంచి ఏడు గ్రాముల పల్లాడియం వినియోగిస్తారు.
కార్బన్ మొనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్‌లను ఈ కన్వర్టర్లు వాటర్ వ్యాపర్‌గా కన్వర్ట్ చేస్తాయి.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో పల్లాడియం కొనుగోలు చాలా ఖర్చుతో కూడుకున్నది.
అంతే కాదు కార్ల ధరలు కూడా పెరుగుతాయి.
Health awareness: తరచుగా తలనొప్పి బాధిస్తుందా.. మైగ్రేన్, సైనస్ కావొచ్చుఏ
వారానికి నాలుగు సార్లు సెక్స్.. మహిళల్లో ఆ సమస్య దూరం
ఫోన్ తయారీ.. దంతాల చికిత్స ఇలా
ప్రతి మొబైల్ ఫోన్‌లో 0.015 గ్రాముల పల్లాడియం వాడతారు.
పల్లాడియంను ఫోన్ ఎంబీడెడ్ మైక్రో ప్రాసెసర్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల్లో వినియోగిస్తారు.
అలాగే దంతాల డ్రిల్ అండ్ ఫిల్ ట్రీట్‌మెంట్‌లోనూ వాడతారు.
వంతెనల నిర్మాణం, కిరీటాల తయారీలోనూ పల్లాడియం వినియోగిస్తారు.
ఫోన్లలో తక్కువ పరిమాణంలో వాడినా.. తప్పనిసరి.
యుద్ధం నేపథ్యంలో రష్యా ధర పెంచితే, సౌతాఫ్రికా కూడా అదే బాటలో ప్రయాణిస్తుంది.
బంగారం ఆభరణాల తయారీలోనూ పల్లాడియం వినియోగిస్తారు.
బాత్రూమ్‌లో ఏ టైల్స్ వేస్తే మంచిది..