Homeఅంతర్జాతీయంRussia Ukraine War : ఉక్రెయిన్ పై హైపర్ సోనిక్ మిస్సైళ్లను వ‌దిలిన రష్యా

Russia Ukraine War : ఉక్రెయిన్ పై హైపర్ సోనిక్ మిస్సైళ్లను వ‌దిలిన రష్యా

Russia Ukraine War : ఉక్రెయిన్ పై హైపర్ సోనిక్ మిస్సైళ్లను వ‌దిలిన రష్యా

Russia Ukraine War : ఉక్రెయిన్ పై మూడు వారాలుగా చేస్తున్న దాడులు ఏమాత్రం ఫలితాన్నివ్వకపోగా, చేజిక్కించుకున్న ప్రాంతాలు సైతం పట్టుజారిపోతుండడం పట్ల రష్యా తీవ్ర అసహనంతో ఉంది.

ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ పై ముప్పేట దాడులకు శ్రీకారం చుట్టిన రష్యా, తాజాగా మరో కీలక అస్త్రాన్ని ఉక్రెయిన్ పై ప్రయోగించింది.

ఇటీవలే అభివృద్ధి చేసిన ‘కింజాల్’ హైపర్ సోనిక్ క్షిపణులను పశ్చిమ ఉక్రెయిన్ లోని ఓ ఆయుధాగారాన్ని ధ్వంసం చేసేందుకు తొలిసారిగా ఉపయోగించింది.

యుద్ధరంగంలో రష్యా ‘కింజాల్’ హైపర్ సోనిక్ క్షిపణులను గతంలో ఎన్నడూ, ఎక్కడా ప్రయోగించలేదు.

ఈ మేరకు రష్యా అధికారిక మీడియా సంస్థ ‘ఆర్ఐఏ నొవోస్తి’ పేర్కొంది.

Curd : పెరుగుతో ఈ ప‌దార్థాల‌ను క‌లిపి తింటే అనేక లాభాలు

Post Office Scheme : పోస్టాఫీస్‌లో ఇలా నెల‌కు రూ.4,950 ఆదాయం

ఇవనో-ఫ్రాంకివ్ స్క్ ప్రాంతంలోని డెలియాటిన్ గ్రామంలో ఓ ఆయుధాగారంలో ఉక్రెయిన్ క్షిపణులను, గగనతల ఆయుధ వ్యవస్థల పేలుడు పదార్థాలను దాచి ఉందన్న సమాచారంతో రష్యా తాజా దాడులు చేపట్టింది.

ఈ దాడుల్లోనే ‘కింజాల్’ హైపర్ సోనిక్ ఏరో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

‘కింజాల్’ అంటే రష్యన్ భాషలో ‘చురకత్తి’ అని అర్థం.

దీన్ని గగనతలం నుంచి భూతల లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు.

వీటిని రష్యా తన మిగ్-31కే, టీయూ-22ఎం3, సుఖోయ్-57 యుద్ధ విమానాలకు అమర్చింది.

కాగా, గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ అత్యాధునిక క్షిపణి గురించి మాట్లాడుతూ, గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా, ధ్వనివేగం కంటే 10 రెట్ల అధిక వేగంతో ప్రయాణించే ఆ క్షిపణి సరైన ఆయుధం అని అభివర్ణించారు.

Financial Security : హైదరాబాద్ లో ఆర్థిక భద్రత తక్కువే!.. మెట్రో నగరాలపై తాజా సర్వే

Credit Card Money Draw : క్రెడిట్ కార్డు నుంచి చార్జీలు ప‌డ‌కుండా డ‌బ్బు డ్రా చేయ‌డం ఎలా..?

Recent

- Advertisment -spot_img