కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా రైతు భరోసా ను రైతులకు అందించేందుకు సిద్దమయ్యింది. అయితే దీని అమలకు సంభందించి నియమ నిబంధనలు గురించి మీకు తెలుసా? రైతు భరోసా పథకాన్ని ఏడెకరాల వరకు పరిమితి విధించింది. అయితే అదాయపు పన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజా ప్రతినిధులకు.. ఈ పథకం వర్తించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం సిద్దం చేస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం తరహాలో.. ఈ పథకాన్ని సైతం అమలు చేయ్యాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లు సమాచారం. అందులోభాగంగా కుటుంబంలో ఎంతమంది పేరిట భూమి ఉన్నా.. అందరిని ఒకే లెక్క కట్టి కుటుంబాన్ని ఓ యూనిట్‌గా తీసుకొని గరిష్టంగా ఏడెకరాల వరకే రైతుబంధు పరిమితం చేసి.. అంతవరకే రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రభుత్వం ప్రణాళికలను సైతం సిద్దం చేస్తోంది.