Rythu Bharosa: రైతు భరోసా నిధుల విడుదలపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రూ.6,000 చొప్పున అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తామని తెలిపారు. నిన్న సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభమైన రైతు భరోసా నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున మొదట విడుదల చేయడం జరిగిందని స్పష్టం చేశారు. విడుదల చేసిన నిధులు నేడు రైతుల అకౌంట్లలో జమ చేయబడ్డాయన్నారు.