రైతు భరోసా డబ్బులు కోసం ఎదురు చూస్తున్న రైతుల నిరీక్షణ ఫలించనున్నది. సంక్రాంతి కానుకగా రైతు భరోసా డబ్బులు అన్నదాతల ఖాతాల్లో వేయనున్నట్లు సమాచారం. అయితే ఏడు ఎకరాల వరకు పొలం ఉన్న అన్నదాతలకు మాత్రమే రైతు భరోసా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు రైతుబంధు కట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.
రైతు భరోసా అమలుపై విధి విధానాలను రూపొందించనున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రభుత్వ హామీ ప్రకారం ఈ రైతు భరోసా పథకం కింద.. ప్రతి రైతుకు సీజన్ కు ఒక సారి ఎకరాకు రూ. 7500 ఇవ్వనున్నారు. ఇది రైతులకు ముందస్తుగా పెట్టుబడిగా ఉపయోగపడుతుంది.