Rythu Bharosa: అన్నదాతలకు రైతు భరోసా పథకం కింద జనవరి 27 నుంచి ఇప్పటి వరకు 30,11,329 మంది రైతులకు రూ.1,834.09 కోట్లు జమ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 27న 577 ఎంపిక చేసిన గ్రామాల్లో 4.41 లక్షల మందికి, ఫిబ్రవరి 5న ఎకరం లోపు సాగు చేస్తున్న 17.03 లక్షల మందికి, సోమవారం 2 ఎకరాలలోపు సాగు చేస్తున్న 8.65 లక్షల మంది ఖాతాల్లో రూ.707.54 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మరి మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా? చెక్ చేసుకోండి.