Rythu Bharosa: రైతుభరోసా పై అన్నదాతలకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం ‘రైతు భరోసా’ నగదు జమ చేయనుంది. ఇవాళ లేదా రేపు ఎకరాకు రూ.6వేల చొప్పున వేయనుంది. ఇప్పటికే ఒక్క ఎకరం ఉన్న 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో సర్కార్ నగదు జమ చేసినట్లు పేర్కొంది. జమ కాని వారు సంబంధిత ఏఈవో లేదా ఏవోను సంప్రదించాలని చెప్పింది. కాగా ఏటా ఎకరానికి రూ.12వేల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
ALSO READ: Rythu Bharosa: రైతు భరోసాపై బిగ్ అప్‌డేట్.. వారికి విడతల వారీగా ఖాతాల్లో డబ్బులు జమ..!