Rythu Bharosa: అన్నదాతలకు మరో శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ రైతులకు కూడా అతి త్వరలో రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. వారు ఎవరంటే.. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలతో రైతు భరోసా పథకానికి కొందరు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ రైతుల బ్యాంకు ఖాతాల పరిశీలన ప్రక్రియను వ్యవసాయశాఖ అధికారులు చేపట్టారు. వాటిని నిర్ధారణ కోసం బ్యాంకులకు పంపించింది తెలంగాణ వ్యవసాయశాఖ. రెండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం అర్హులైన వారందరికీ నిధులు జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కాగా దాదాపు 3 లక్షల మంది రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు.