Rythu Bharosa: రైతు భరోసా అందని అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా సాయం అందని రైతులను ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రాబోయే మార్చి 31లోగా రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతాలో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం రూ.54,280 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. అదే విధంగా రాష్ట్ర బడ్జెట్‌లో రూ.72 వేల కోట్ల నిధులను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే కేటాయించామని గుర్తు చేశారు.