‘రైతు భరోసా’ ను సంక్రాంతి నుంచి అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. దీని కోసం రైతుల నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. సాగు చేసే రైతులందరికీ సాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ‘రైతు భరోసా’కు, కేబినెట్ కమిటీ సిఫారసులకు ఆమోద ముద్ర వేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
జనవరి 5 నుంచి రైతు భరోసా దరఖాస్తులు స్వీకరణ?
రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా..? ప్రభుత్వానికి కేటీఆర్ సూటి ప్రశ్నలు..!