Rythu Bharosa: రైతు భరోసాపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 31 వరకు రైతు భరోసాను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హామీ ఇచ్చారు. మంచిర్యాలలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. రూ. 21 వేల కోట్లతో రుణమాఫీ చేశామని తెలిపారు. రుణమాఫీ అయిన కుటుంబాలు కాంగ్రెస్ కు అండగా ఉండాలని ఆయన కోరారు. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అన్నాడని.. తమ ప్రభుత్వం వచ్చాక వరి వేసిన రైతుల ఖాతాల్లో క్వింటాల్ కు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చామన్నారు.