Rythu Bharosa: రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉగాది నుంచి 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నట్లు తెలుస్తుంది. 3 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ఇప్పటికే డబ్బు జమ చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడ 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు సహాయం అందించడానికి సిద్ధం అవుతోందని తెలుస్తుంది. అన్నీ అర్హతలు ఉండి 3 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాకపోతే, సంబంధిత ఏఈవోలను సంప్రదించాలి. వారికి విషయాన్ని తెలియజేసి ఫిర్యాదు చేయాలి. వాళ్లు ప్రభుత్వానికి సమస్యను వివరిస్తారు. ఆతర్వాత మీకు అర్హత ఉన్నట్లు రుజువైతే మీ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.