Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఈనెల 26న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఎకరానికి రెండు విడతల్లో రూ.12వేల సాయం అందించనుంది. మార్చి 31లోపు అర్హత గల రైతుల ఖాతాల్లో మొదటి విడత డబ్బులను జమ చేయనుంది. కాగా రైతు భరోసా స్కీమ్ కు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ లను దారఖాస్తుకు జత చేసి వ్యవసాయ అధికారులకు అందజేయాలి.