రైతు భరోసా పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. నిజామాబాద్ జిల్లా రాంరెడ్డి గార్డెన్లో కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. అలాగే కీలక ప్రకటన చేశారు. సంక్రాంతికి ఎకరాకు రూ.7చొప్పున రైతు భరోసా వేస్తామని చెప్పారు. అలాగే తమ ప్రభుత్వం వచ్చే నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తుందన్నారు. అలాగే కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా పేదలకు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.