Rythu Bharosa: రైతుభరోసా అందని భూముల వివరాలను గ్రామాల వారీగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటి వివరాలను పంచాయతీ ఆఫీసుల్లో అందుబాటులో ఉంచేందుకు రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో సాగుకు యోగ్యంగా లేని భూములు ఎన్ని ఉన్నాయని ఆరా తీస్తున్నారు. ఈ నెల 26న రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.6వేల ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. అయితే, సాగులో ఉన్న భూములకు మాత్రమే సాయం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.