ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. తెలంగాణలో రైతులు నిరీక్షిస్తున్న రైతు భరోసా అమలు పైన సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు. రైతు భరోసా పైన ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘం నియమించిన విషయాన్ని గుర్తు చేసారు. భట్టి కమిటీ ఇచ్చే నివేదికను ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టి చర్చిస్తామని చెప్పారు. రైతు భరోసా అమలు పైన సభలో అందరి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా ఎంత మేర అమలు చేస్తారు.. ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలనేది చర్చ జరుగుతోంది. సాగు చేసే రైతులకు ఇవ్వాలనే చర్చ వినిపిస్తోంది. దీంతో, రైతు భరోసా అమలు పైన సబ్ కమిటీ వేసినట్లు సీఎం వెల్లడించారు.