Homeహైదరాబాద్latest NewsRythu Bharosa: రైతు భరోసా.. త్వరలోనే మూడు ఎకరాలకు పైబడిన వారి ఖాతాల్లోకి డబ్బులు..!

Rythu Bharosa: రైతు భరోసా.. త్వరలోనే మూడు ఎకరాలకు పైబడిన వారి ఖాతాల్లోకి డబ్బులు..!

Rythu Bharosa: తెలంగాణ రైతు భరోసా పథకంపై లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని నిధులను కేటాయించింది. ఈ పథకం ద్వారా ఎకరానికి రూ. 12,000 చొప్పున పెట్టుబడి సహాయం అందజేస్తున్నారు. గతంలో రైతు బంధు పథకం కింద రూ. 10,000 ఇచ్చిన స్థానంలో 12,000 చొప్పున పెట్టుబడి సహాయం అందజేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ. 18,000 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం, మూడు ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి, మూడు ఎకరాలకు పైబడిన రైతులకు త్వరలో నిధులు జమ చేయనున్నారని తెలుస్తుంది. అయితే, కొంతమంది రైతులు నిధులు ఆలస్యం కావడం, సాగు చేయని భూములకు సహాయం రాకపోవడంతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే మూడు ఎకరాలకు పైబడిన రైతులకు త్వరలో నిధులు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img