Homeహైదరాబాద్latest Newsరైతు భరోసా.. ఖాతాల్లో నగదు జమ ఎప్పుడంటే..?

రైతు భరోసా.. ఖాతాల్లో నగదు జమ ఎప్పుడంటే..?

రైతుభరోసాపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక రాగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నివేదిక రాగానే రాబోయే పంట కాలం నుంచి రైతులకు ఎకరాకు రూ.7500 సాయం అందిస్తామని తెలిపారు. ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతుభరోసాను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది.

Recent

- Advertisment -spot_img