Homeహైదరాబాద్latest Newsరైతు భరోసా.. అన్నదాతల నిరీక్షణకు తెరపడనుందా?

రైతు భరోసా.. అన్నదాతల నిరీక్షణకు తెరపడనుందా?

రైతు భరోసా కోసం అన్నదాతలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్‌లో సాయం అందని రైతులకు కనీసం రబీ సీజన్‌లోనైనా సాగు పెట్టుబడులకు ఆర్థిక సాయం అందించే “రైతు భరోసా”కు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా..? రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారా? అన్న అనుమానాలు అన్నదాతల నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే ఏటా ఎకరాకు రూ.15,000 పెట్టుబడికి ఈ మొత్తాన్ని ఎకరాకు రూ.7500 చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చి, పథకం పేరును రైతు భరోసాగా మార్చారు. మరో అడుగు ముందుకేసి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా సాయం రూ. 12,000 చేస్తామని హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. రబీ సీజన్‌ను ముగియడంతో రైతులపై ప్రభుత్వం కరుణ చూపుతుందా లేదా అన్న సందేహం రైతుల్లో నెలకొంది. చూడాలి రైతుల నిరీక్షణకు ఎప్పుడు తెలపడనుందో.

Recent

- Advertisment -spot_img