హైదరాబాద్ః సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్కూళ్లను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహేశ్వరం జిల్లా పరిషత్ బాలుర, బాలిక పాఠశాలల్లో మంత్రి సబితమ్మ తనిఖీ చేపట్టారు. రెండు పాఠశాలలో టీచర్ల హాజరును పరిశీలించారు. ఎంత మంది స్టూడెంట్స్ ఇండ్లలో టీవీలు, సెల్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయో టీచర్లను అడిగి తెలుసుకున్నారు. టీవీ, సెల్‌ఫోన్ సదుపాయం లేని వారిని గుర్తించి వారికి తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ఆన్‌లైన్ పాఠాలను స్టూడెంట్స్ అనుసరిస్తున్నారో లేదోనని తెలసుకోవాలని టీచర్లకు సూచించారు. స్టూడెంట్స్ పేరెంట్స్ ఫోన్ నెంబర్లను తీసుకోని వాటితో వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటిస్తూ విధులకు హాజరు కావాలని మంత్రి సబితిమ్మ టీచర్లకు సూచించారు. మంత్రి సబితమ్మ వెంట జెడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి కూడా ఉన్నారు.