Homeహైదరాబాద్latest News51వ ఏట అడుగుపెట్టిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌

51వ ఏట అడుగుపెట్టిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌

టీం ఇండియా క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ ఈరోజు 51వ ఏట అడుగుపెట్టాడు. సచిన్ టెండూల్కర్ 1989 నవంబర్ 16న కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 1990 ఆగస్టు 14న సచిన్ టెస్టుల్లో తొలి సెంచరీ సాధించాడు. 1994లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో సచిన్ 110 పరుగులు చేసి వన్డేల్లో తొలి సెంచరీ సాధించాడు. 1996లో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే 1996 వరల్డ్‌కప్‌, 2003 ప్రపంచకప్‌ టోర్నీల్లో సచిన్‌ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 2011లో భారత్‌ వేదికగా టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు. ఓవరాల్‌గా ఐసీసీ టోర్నీల్లో ఆరు శతకాల సాయంతో 2278 పరుగులు సాధించి.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్‌ కొనసాగుతున్నాడు.

Recent

- Advertisment -spot_img