ప్రముఖ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత సోషల్ మిడిల్ ద్వారా తెలిపింది. ‘మనం మళ్లీ కలిసే వరకు నాన్న’ అనిసమంత పోస్ట్ పెట్టింది. సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు మరియు నీనెట్ ప్రభు దంపతులకు జన్మించింది. సమంత తండ్రి ఆరోగ్య సమస్యల కారణంగానే ఆయన మృతి చెందినట్లు తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ప్రతి క్షణం తన తండ్రి అండగా నిలిచి తనకు అండగా నిలిచారని సమంత చెప్పింది. సమంత తండ్రి మరణవార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.