- గోడ పత్రికను విడుదల చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు గౌరు కృష్ణ, సభ్యులు.
ఇదేనిజం, శేరిలింగంపల్లి:జూన్ 28 నుంచి 30 వరకు సహజయోగా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు సహజ యోగ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గౌరు కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం అందుకు సంబంధించిన గోడ పత్రికను సభ్యులతో కలిసి ఆయన చందానగర్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భముగా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గౌరు కృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ లో ఉన్న ప్రతి మనిషికి సహజ యోగ ద్వారా వచ్చే ప్రశాంతతను ,ఆనందాన్ని అందించటానికి, హైదరాబాద్ రియలైజేషన్ టూర్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రోగ్రాం జూన్ 28 నుండి 30 వరకు నిర్వహించనున్నట్లు సుమారు 500 మంది ప్రతినిధులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు,విదేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సహజయోగా పరిచయ కార్యక్రమాలు , స్ట్రెస్ మానేజ్ మెంట్ సెషన్స్ ని వివిధ కళాశాల,పాఠశాలలోనిర్వహించబోతున్నామన్నారు.సాయంత్రం మెగా సహజయోగ పరిచయ , సంగీత కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. ఈ కార్యక్రమాలు సరూర్ నగర్ ఇండోర్ స్టేడీయంలో జూన్ 28న , నిజాంకాలేజ్ గ్రౌండ్స్ లో జూన్ 29న , 30 న పీ జే అర్ స్టేడియం చందానగర్ లో సాయంత్రము 5 గంటలకు లకు నిర్వహించబోతున్నారన్నారు.