Homeసినిమా'Sai Manjrekar' in black dress బ్లాక్​ డ్రెస్​లో మెరిసిన ‘Saiee Manjrekar’

‘Sai Manjrekar’ in black dress బ్లాక్​ డ్రెస్​లో మెరిసిన ‘Saiee Manjrekar’

సీనియర్‌ నటుడు మహేష్‌ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్‌ .. సల్మాన్‌ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. దబాంగ్‌3లో మెరిసి మెప్పించింది. కానీ తెలుగులో ఎక్కువ ఆఫర్లని అందుకుంటున్నది. ఇప్పటికే బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు ఆఫర్లని అందుకుంది.
వరుణ్‌ తేజ్‌ గని చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మాయ పాత్రలో కనిపించింది. ఈ సినిమా డిజాస్టర్‌ అయ్యింది. అయినా ఈ అమ్మడికి ఆఫర్ల వెల్లువలా వస్తున్నాయి. గని తర్వాత మేజర్‌ చిత్రంలో మెరిసింది. అడవి శేష్​ సరసన నటించింది. ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఆడింది. కానీ ఈ అమ్మడికి మాత్రం క్రెడిట్‌ రాలేదు. అంతా అడవి శేష్‌ తీసుకెళ్లిపోయాడు. ఇందులో సయీ నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఇటీవల స్కంద మూవీలోనూ సయీ మంజ్రేకర్ నటించింది. ఇలా తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. గ్లామర్‌ ఫొటోలు అప్​లోడ్​ చేస్తూ అలరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్​ డ్రెస్‌లో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img