సాయి పల్లవి, శివ కార్తీకేయన్ కాంబినేషన్లో వచ్చిన మూవీ ‘అమరన్’. ఈ మూవీ తెలుగు, తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో సాయి పల్లవి తాజాగా తన చెల్లితో కలిసి వెకేషన్ వెళ్లింది. చెల్లెలు పూజా కన్నన్, స్నేహితులతో కలిసి ఈ వెకేషన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ‘ప్రేమించే వ్యక్తులతో ఒక అందమైన ప్రయాణాన్ని గుర్తుంచుకోవడానికి, సాహసం, ఒక చిన్న నవ్వు’ అనే క్యాప్షన్‌తో సాయి పల్లవి పలు ఫొటోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.