Homeసినిమాయష్​–19లో సాయిపల్లవి?

యష్​–19లో సాయిపల్లవి?

యూత్​లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో మలయాళీ భామ సాయి పల్లవి ఒకరు. అందం, అభినయంతో పాటు డ్యాన్స్​తోనూ సాయిపల్లవి ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తండేల్ మూవీలో ఆమె హీరోయిన్​గా నటిస్తోంది. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, లేటెస్ట్ బజ్​ ప్రకారం.. కన్నడ స్టార్ యష్​ నటిస్తున్న 19వ సినిమాలో సాయిపల్లవిని హీరోయిన్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది. యష్​–19 మూవీకి అఫిషియల్ టైటిను శుక్రవారం ఉదయం 09:55 గంటలకి రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్​కు గీతు మోహన్‌దాస్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే, సాయిపల్లవిని హీరోయిన్​గా తీసుకున్నట్లు మేకర్స్​ నుంచి తొందరలోనే అఫిషియల్ క్లారిటీ వచ్చే అవకాశముంది.

Recent

- Advertisment -spot_img