చెన్నై: కేరళ కుట్టి, నటి సాయి పల్లవి ఫారిన్ మెడికల్ గ్యాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పరీక్ష రాసింది. విదేశాల్లో ఆమె వైద్య విద్యను అభ్యసించింది. సాధారణంగా విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన తరువాత ఇండియాలో ప్రాక్టీసు చేసేందుకు ప్రత్యేక పరీక్ష రాయాల్సి ఉంటుంది. సినిమాలోకి రావడంతో వైద్య రంగానికి దూరం అయింది. కానీ వైద్యం పై ఉన్న మక్కువ చంపుకోలేని సాయిపల్లవి తిరుచ్చిలో ఎంఏఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఫారిన్ మెడికల్ గ్యాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) కు హాజరైంది. ఆమెను గుర్తుపట్టిన పలువురు వైద్యులు సెల్ఫీలు తీసుకున్నారు.