Saidaram tej:
జీవితం సాఫీగా సాగిపోతున్న టైంలో బైక్ ప్రమాదం తనకు బాధంటే ఏంటో నేర్పిందని మెగా హీరో సాయి తేజ్ (saidharm tej)అన్నాడు. ఆసుపత్రిలో కోలుకున్న తర్వాత మొదట నేను చూసింది అమ్మా, తమ్ముడినే. వారిని పలకరించడానికి కూడా మాట బయటకు రాలేదు. అప్పుడే బాధంటే ఏంటో తెలిసింది. నేను చేసిన పనికి నా అభిమానులు కూడా ఎంతో ఆందోళన చెందారు. నేను నిజంగా తప్పు చేశాను నన్ను క్షమించండి. ఆరోజు నన్ను కాపాడింది నా హెల్మెట్ మాత్రమే.
దయచేసి ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించండి’ అంటూ సాయి తేజ్ ఎమోషనల్ అయ్యాడు. కొంత గ్యాప్ తర్వాత ఈ మెగా హీరో ‘విరూపాక్ష’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 21న ఫ్యాన్స్ పక్కా కాలర్ ఎగరేసుకునే సినిమా చూడనున్నారని ధీమా వ్యక్తం చేశాడు.