విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్గా టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా‘సైంధవ్’. భారీ అంచనాలున్న ఈ సినిమా ఇప్పటి వరకు సూపర్‌గా వచ్చింది అని కూడా టాక్. మరి మేకర్స్ ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని కారణాల రీత్యా సినిమా సంక్రాంతికి షిఫ్ట్ అయ్యినట్టుగా రూమర్స్ వచ్చాయి. ఇక ఫైనల్ గా అయితే ఈ సస్పెన్స్ కి మేకర్స్ తెర దించేశారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 13 రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో సంక్రాంతి సినిమాల హీట్ మరింత మారిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది.