HomeతెలంగాణSajjanar to RTC Drivers : ఆర్టీసీ డ్రైవర్లకు సజ్జనార్ హెచ్చరిక.. అలా చేస్తే కఠిన...

Sajjanar to RTC Drivers : ఆర్టీసీ డ్రైవర్లకు సజ్జనార్ హెచ్చరిక.. అలా చేస్తే కఠిన చర్యలు

Sajjanar warning to RTC Drivers : ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ సోమవారం కీలక ఆదేశాలు జారీచేశారు.

ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు ఆర్టీసీ బస్సులు రోడ్డు మధ్యలో ఆపొద్దన్నారు. 

రోడ్డు మధ్యలో బస్సులు ఆపడం ట్రాఫిక్ నియమాలకు విరుద్దం అని.. ట్రాఫిక్ పోలీసులు కనుక ఫైన్ విధిస్తే ఆ మొత్తాన్ని సంబంధిత డ్రైవర్లే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

అంతేకాకుండా సదరు డ్రైవర్లపై క్రమశిక్షణ చర్యలు సైతం తీసుకోవాల్సి వస్తుందని ఉత్తర్వులు జారీ చేశారు సజ్జనార్.

ఆర్టీసీ బస్సులను రోడ్డు మధ్యలో ఆపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా అనేక ఫిర్యాదులు వస్తున్నాయని సజ్జనార్ తెలిపారు.

దీని వల్ల ఆర్టీసీ ప్రతిష్ట దెబ్బతింటోందని అన్నారు. సంస్థకున్న పరపతిని పెంచుకోవాలని.. ఉన్న దాన్ని కాపాడుకోవాలని సూచించారు.

రోడ్డు మధ్యలో బస్సులను ఆపడం నేరమన్న విషయంలో డ్రైవర్లను అప్రమత్తం చేయాలని.. అందుకోసం డిపోల నుంచి రోడ్డపైకి వచ్చే ముందు డిజీల్ బంకుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

డ్యూటి చార్టులు ఇచ్చే ముందు డ్రైవర్లకు సూపర్‌వైజర్లు ఈ విషయాలను చెప్పాలన్నారు.

నిబంధనలను విరుద్దంగా వ్యవహరించే డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవన్న విషయాన్ని డ్రైవర్లకు వివరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img