తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారి చేశారు. విధులకు హాజరయ్యే టీఎస్ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఇకపై జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకోకూడదని సంస్థ ఎండీ సజ్జనార్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు మినహా మిగతా వాళ్లు క్యాజువల్ డ్రెస్సులు వేసుకోవడం వల్ల సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులంగతా యూనిఫామ్ లోనే విధులకు హాజరు కావాలని సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.