Homeతెలంగాణఫ్రీ బస్​ జర్నీపై సజ్జనార్​ పరిశీలన

ఫ్రీ బస్​ జర్నీపై సజ్జనార్​ పరిశీలన

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మహిళలు, బాలికలు, ట్రాన్స్​ జెండర్ల కోసం మహాలక్ష్మి– మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలు తీరుపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జేబీఎస్-ప్రజ్ఞాపూర్, జేబీఎస్-జనగామకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో, బాన్సువాడకు వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ సౌకర్యం అమలవుతున్న తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేబీఎస్-వెంకట్ రెడ్డి నగర్(రూట్ నంబర్ 18 వీ/జే) సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్‌ను అందజేశారు. అనంతరం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందన్నారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఉచిత బస్ ప్రయాణ స్కీమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసి.. వాటిపై 40 వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించామని గుర్తు చేశారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ స్థానికతను నిర్థారించుకునేందుకు తమ ఆధార్ కార్డులను సిబ్బందికి చూపించి.. సంస్థకు సహకరించాలని కోరారు.

Recent

- Advertisment -spot_img