Homeహైదరాబాద్latest News'Salar' action scenes in Hollywood range..! Hollywood​ రేంజ్​లో ‘Salar’యాక్షన్ సీన్లు..!

‘Salar’ action scenes in Hollywood range..! Hollywood​ రేంజ్​లో ‘Salar’యాక్షన్ సీన్లు..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్​గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్​లో వస్తున్న మూవీ సలార్ పార్ట్ –1 సీస్ ఫైర్. వచ్చే నెల 22న ఈ సినిమా పాన్​ ఇండియా మూవీగా ఆడియన్స్ ముందుకి రానుంది. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ గ్రాండ్​గా నిర్మించిన ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఆడియన్స్​లో మంచి హైప్ నెలకొని ఉంది. ప్రభాస్​ ఫ్యాన్స్ అయితే సలార్ రిలీజ్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీన్లు హాలీవుడ్ మూవీస్​ని తలదన్నేలా ఉండనున్నాయనేది లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్. ఇక ఈ యాక్షన్ సీన్స్ షూటింగ్ కోసం ఏకంగా 750 కి పైగా జీప్‌లు, భారీ ట్యాంకులు, ట్రక్కులు మొదలైన వాటితో సహా పలు డిఫరెంట్​ వెహికల్స్​కు వాడినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం సినిమాలో చాలా ఆన్‌గ్రౌండ్ యాక్షన్ ఉండడమేనని సమాచారం. హాలీవుడ్ సినిమాల్లో పెద్ద వార్ సీక్వెన్స్ తీసే సమయంలో ఈ రేంజ్​లో వాహనాలు, టెక్నీకల్ టీమ్​ను వాడతారు. మొత్తంగా రోజు రోజుకు అందరిలో భారీ అంచనాలు ఏర్పరుస్తున్న సలార్ మూవీ ఈ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img