దేశ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎగ్జయిటింగ్ సినిమాలు ఈ నెలలో క్లాస్ కానున్నాయి. షారుఖ్ నటించిన డంకీ, ప్రభాస్ నటించిన సలార్ ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వస్తున్నాయి. ఈ నెల 21న డంకీ రిలీజ్ కానుంది. అంటే సలార్ రిలీజ్ కి ఒక రోజు ముందుగానే వస్తుంది. అయితే డంకీ డ్రాప్ 1 వ్యూస్‌ను సలార్ ట్రైలర్ భారీగా అధిగమించింది. సలార్ థియేట్రికల్ ట్రైలర్‌కు నేషనల్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సలార్‌పై అంచనాలు మరింత పెరిగాయి. సలార్ ట్రైలర్‌కు అన్ని భాషల్లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన డంకీ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.