Homeహైదరాబాద్latest NewsSalman Khan : ఒకపక్క ఫ్లాపులు.. మరోపక్క బెదిరింపులు

Salman Khan : ఒకపక్క ఫ్లాపులు.. మరోపక్క బెదిరింపులు

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ జీవితం ప్రస్తుతం గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఇటీవీలే సల్మాన్ ఖాన్ చేసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లు అవుతున్నాయి. భారీ అంచనాలు మధ్య ఈ ఏడాది వచ్చిన ”సికందర్” సినిమా అయితే సల్మాన్ సినీ కెరీర్ లోనే అతి పెద్ద ప్లాప్ గా నిలిచింది. ఇది ఇలా ఉండగా సల్మాన్ ఖాన్ పర్సనల్ లైఫ్ కూడా సరిగా లేదు. ఇటీవలే ఎక్కువగా సల్మాన్ ఖాన్ కు హత్య బెదిరింపులు వస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చాలా కాలంగా సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. గత సంవత్సరం, ఇదే గ్యాంగ్‌స్టర్ షూటర్లు సల్మాన్ ఖాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని చంపారు. తర్వాత అతను తదుపరి లక్ష్యం సల్మాన్ ఖాన్ అని చెప్పాడు. ఆ తర్వాత, ముంబైలోని వర్లిలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌పై కాల్పులు జరిగాయి. తరువాత, సల్మాన్ ఖాన్ తన ఇంటి బాల్కనీలో బుల్లెట్ ప్రూఫ్ గాజును ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో వారికి కల్పించిన భద్రతను పెంచారు. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ కు మరో ప్రాణహాని కాల్ వచ్చింది. ఈసారి దుండగులు సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడి అతని కారును పేల్చివేస్తామని బెదిరించారు. సల్మాన్ వాట్సాప్ నంబర్‌కు తెలియని నంబర్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. దీనివల్ల సల్మాన్ ఖాన్ ప్రాణానికి రోజురోజుకూ ప్రమాదం పెరుగుతుంది.

Recent

- Advertisment -spot_img