కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. చాలామంది శరీర రంగు నలుపు రంగుగా ఉంటుందని, అంతమాత్రాన దాని ఆధారంగా వ్యక్తి యోగ్యతను నిర్ణయిస్తారా అంటూ పిట్రోడా వ్యాఖ్యలను ప్రధాని మోదీ తీవ్రంగా తప్పుబట్టారు.
వరంగల్ మామునూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. శరీర రంగు పేరుతో దేశాన్ని కాంగ్రెస్ విభజించాలని చూస్తోందని ప్రజలను అవమానిస్తే తాను ఎప్పటికీ సహించబోనని హెచ్చరించారు.
అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ, లోక్‌సభ ఎంపీ అభ్యర్థి, నటి కంగనా రనౌత్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమ్మెత్తిపోశారు. మరోవైపు ఈ వివాదంపై కాంగ్రెస్ స్పందించింది. “పిట్రోడా వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది ” అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ అన్నారు.
భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంగా వర్ణించే క్రమంలో “తూర్పును ఉన్న ప్రజలు చైనీయులుగా, పశ్చిమాన ఉన్నవారు అరబ్బులుగా, ఉత్తరభారత ప్రజలు శ్వీతజాతీయులుగా అదేవిధంగా దక్షిణాదివాళ్లు ఆఫ్రికన్లుగా” ఉంటారంటూ వ్యాఖ్యానించారు.