Samantha in Kadapa : కడపలో సమంత సందడి.. పెద్ద దర్గాలో..
Samantha in Kadapa – అగ్రకథానాయిక సమంత ఆదివారం కడప నగరంలో సందడి చేశారు.
కడపలో కొత్తగా ఏర్పాటుచేసిన ఓ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు.
ఈ క్రమంలో షాపింగ్‌మాల్ ప్రచారంతో సమంత కడపకు వస్తున్నారనే సమాచారం జనాలకు తెలిసింది.
దీంతో వేల సంఖ్యలో యువత, అభిమానులు షాపింగ్ మాల్ వద్దకు రెండు గంటలు ముందుగానే చేరుకున్నారు.
సమంతను చూసి కేరింతలు కొట్టారు.
తనను చూసేందుకు వచ్చిన అభిమానులతో కడపకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు సమంత.
అలాగే ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ‘స్వామీ నదికి వెళ్లలేదా’ అనే డైలాగ్ చెప్పి వారిని అలరించారు.
సమంతను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో వారిని నిలువరించడం పోలీసులకు కష్టంగా మారింది.
దాదాపు రెండు గంటలకు పైగానే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ దారి మళ్లించారు.
షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనంతరం కడపలోని పెద్ద దర్గాను సమంత దర్శించుకున్నారు.
చాదర్‌ను సమర్పించారు. ఈ సందర్భంగా సమంతతో దర్గా పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.