Homeసినిమాసమంత కిర్రాక్ వర్కవుట్.. వీడియో వైరల్‌

సమంత కిర్రాక్ వర్కవుట్.. వీడియో వైరల్‌

హైదరాబాద్ః స్టార్ హీరోయిన్ సమంత ఫిట్‌నెస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలిన అవ‌స‌రం లేదు. సినిమాలు ఉన్నా లేకున్నా తాను మాత్రం ఎప్పుడు ఫిట్‌గా ఉండేందుకు క‌స‌ర‌త్తులు చేస్తుంటారు.

కఠినమైన వర్కవుట్స్, డైట్‌ను కొనసాగిస్తూనే ఉంది. తన వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది.

తాజాగా ప్లాంట్ బేస్డ్ డైట్‌, వర్కవుట్స్‌ను సమంత ప్రారంభించింది. ఆ విభాగంలో నిపుణుడైన కృష్ణ వికాస్ పర్యవేక్షణలో కఠిన వ్యాయామం చేస్తోంది.

ఆ వీడియోను సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సమంత సూపర్ ఫిట్‌గా ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img