Samantha New Home after divorce : ఇక నుండి సమంత మకాం ఎక్కడో తెలుసా..?
అక్టోబర్ 2న సమంత – నాగ చైతన్య తమ వివాహ బంధానికి బ్రేక్ వేసినట్టు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక అప్పటి నుండి ఎక్కడ చూసినా జనాల్లో ఒక్కటే హాట్ టాపిక్. అదే నాగ చైతన్య- సమంత డివోర్స్ మ్యాటర్.
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌గా ఉన్న ఈ జంట సడెన్‌గా తమ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టడాన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు.
అసలు ఆ ఇద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది? ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
అయితే చైతూ నుండి విడిపోయిన తర్వాత సమంత సోలోగా ఉంటుంది.
ఆమె ముంబైకి మకాం మార్చనుందని కొద్ది రోజుల క్రితం వార్తలు రాగా, దానిని ఖండించింది.
హైదరాబాద్‌లోనే ఉంటానని పేర్కొంది. తాజా సమాచారం ప్రకారం గచ్చిబౌలిలోని ఓ ప్లాట్‌కు సమంత షిఫ్ట్ కానుందని, ఇకపై అక్కడే ఒంటరిగా నివసించనుందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.
శాకుంతలం సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసిన సమంత ప్రస్తుతం కాతువాకుల రెండు కాదల్ అనే చిత్రం చేస్తుంది.
ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా కొద్ది రోజులుగా చెన్నైలోనే ఉంటుంది.