హైదరాబాద్: టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేని తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో జిమ్లో ఎక్స్ ర్ సైజ్ చేస్తున్న ఫోటోను పెట్టారు. దీంట్లో తను బ్లాక్ స్పోర్ట్స్ బ్రా మ్యాచింగ్ లెగ్గింగ్స్ తో కుర్రాళ్ల మతిపోగొడుతున్నారు. మ్యారేజ్ ముందున్న ఎనర్జిటిక్ మ్యారేజ్ తర్వాత కొనసాగిస్తోంది. తాజాగా వెగాన్(వెజిటెరియన్)గా మారిన సమంత.. తానే సొంతంగా ఇంటి పెరట్లో కూరగాయలను పండించుకోవడం గురించి తన సోషల్ మీడియా అకౌంట్లో వీడియో సైతం పోస్టు చేశారు.
సోషల్ మీడియాలో తరచూ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంటే సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో మరో పోస్టు చేశారు. కరోనా కాలంలో ఇంటి వద్దనే ఖాళీగా ఉన్న క్రమంలో యోగా, ధ్యానం ద్వారా యాక్టివ్గా ఉండేందుకు దోహదం చేసినట్లు సమంత పేర్కొన్నారు. ‘తాను శారీరక మార్పుల కోసం ఎక్స్ ర్సైజులు చేయనని, కేవలం సంతోషకర హార్మోన్ల రిలీజ్ కోసమే చేస్తానని’ తాజా పోస్టులో సమంత రాసుకొచ్చారు.